– శ్రీ గాయత్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం
– వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్
– శ్రీ గాయత్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నగునూరి రాజారాం
వతెలంగాణ-మల్హార్ రావు:-
వాస్తు శిల్పి, ప్రతిమశాస్త్ర పితామహుడు విరాట్ శ్రీ గాయత్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నగునూరి రాజారాం అని అన్నారు. మంగళవారం శ్రీ గాయత్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వల్లెoకుంట ఆంజేయస్వామి దేవాలయం లో ఏర్పాటు చేసిన విశ్వకర్మ జయంతి కార్యక్రమంలో విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రయోజనకరంగా వాస్తు ప్రకారం పట్టణాలు, భవనాల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు, మన సంస్కృతిలో విగ్రహాల రూపకల్పనపై భావితరాలకు దిశానిర్దేశం అందించిన మహనీయుడు విరాట్ విశ్వకర్మ అని అన్నారు. , ఓదెల సాంబయ్య, ఓదెల సమ్మయ్య, ఓదెల తిరుపతి, మియ్యపురం సాదానందం, బోనాల నగేష్ , నర్సింహాచారి , ఆలయాకమిటి చైర్మన్ బాపు రావు, రజక సంఘం నాయకులు పావిరాళా లక్ష్మణ్, పావిరాల రాము,తదితరులు పాల్గొన్నారు.