విజువల్‌ వండర్‌గా విశ్వంభర

As a visual wonder universeచిరంజీవి నటిస్తున్న క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వంభర’ మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, బిగ్‌ మాస్‌ బొనాంజాతో ముందుకు వచ్చారు.
‘వెన్‌ మిత్‌ కొల్లాయిడ్స్‌ లెజెండ్స్‌ రైజ్‌’ అనే కోట్‌తో ఉన్న ఈ వండర్‌ ఫుల్‌ పోస్టర్‌లో చిరంజీవి ఒక రాతిపై కూర్చొని, ప్రత్యేక శక్తులతో కూడిన త్రిశూలాన్ని పట్టుకుని పవర్‌ఫుల్‌గా కనిపించారు.
చిరంజీవి త్రిశూలం వైపు ఇంటెన్స్‌ లుక్స్‌తో చూస్తూ యూత్‌ ఫుల్‌ అండ్‌ డైనమిక్‌గా కనిపించారు. విజువల్‌గా అద్భుతమైన ఈ ఫస్ట్‌లుక్‌ స్ట్రాంగ్‌ బజ్‌ని క్రియేట్‌ చేసింది. సినిమాపై అంచనాలను పెంచింది.
తన డెబ్యు మూవీ ‘బింబిసార’తో బ్లాక్‌ బస్టర్‌ అందించిన దర్శకుడు వశిష్ట తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. మూవీ కోసం ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సష్టించారు. ఈ పోస్టర్‌ సైతం హై-ఆక్టేన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌లు, అద్భుతమైన డ్రామాతో విజువల్‌ వండర్‌గా ఉంటుందని హామీ ఇస్తోంది.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బ్లాక్‌బస్టర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.త్రిష కష్ణన్‌, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్స్‌ నటిస్తుండగా, కునాల్‌ కపూర్‌ పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.
విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ ఈ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌ని చాలా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.
ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌, సంగీతం: ఎంఎం కీరవాణి, డీవోపీ: చోటా కె నాయుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఏఎస్‌ ప్రకాష్‌.