నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ముందస్తు మొక్కుల్లో భాగంగా ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు, ఈ రోజు ఆదివారం కావడంతో మేడారంలో భక్తజనం పోటెత్తారు, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బంగారం గా పిలవబడే నిలువెత్తు బెల్లం మొక్కుబడిగా ఇస్తున్నారు,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు, జాతర దగ్గరకు రావడంతో ఆదివారం వస్తె లక్షల సంఖ్యలో భక్తులు మేడారం వచ్చి తల్లులకు మొక్కులు సమర్పిస్తున్నారు.