నవతెలంగాణ-పెనుబల్లి
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అధికారుల బృందం సోమవారం పెనుబల్లి మండలం గౌరారం గ్రామంలో పర్యటించింది. శ్రీనివాస రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న వరి పంట పొలాన్ని పరిశీలించి 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో వరి పంటను కోసి ప్రయోగం నిర్వహించారు. ఈ ప్రయోగంలో 9.760 కిలోల పంట దిగుబడి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమములో అర్ధ గణాంక శాఖ అధికారులు రామభద్రం, ఉపగణాంక అధికారి కే వెంకట్రావు, గణాంక అధికారి కె. వెంకటేశ్వర్లు, ఉపగణాంక అధికారి శ్రీకాంత్, మండల గణాంక అధికారి రఘు స్థానిక రైతులు పాల్గొన్నారు.