– చెరువుల ప్రత్యక్ష పరిశీలన
– అన్యాక్రాంతంపై హైకోర్టుకు నివేదిక
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటల అన్యాక్రాంతంపై గతంలో నమోదైన కేసులకు సంబంధించి ఏర్పాటైన కమిషన్ సభ్యులు జస్టీస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, రెవెన్యూ ప్రభుత్వ ప్లీడర్ టి.శ్రీకాంత్ రెడ్డి ఇతర సభ్యులు, అధికారులు గురువారం చెరువులను పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండల పరిధిలోని దుర్గంచెరువు, సున్నం చెరువు, మేడికుంట, గోసాయి కుంట, పెద్ద చెరువు, గంగారం పెద్ద చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. చెరువుల ఆక్రమణలు, వాటి స్థితిగతులకు సంబంధించి మూడు వారాల వ్యవధిలో సీల్డ్ కవర్‌లో నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు. కమిషన్ సభ్యుల వెంట రంగారెడ్డి జిల్లా భూ పరిరక్షణ తహసీల్దార్ డి.శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రనగర్ తహసీల్దార్ రాములు, రాజేంద్రనగర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వెంకటేష్, శేరిలింగంపల్లి డిప్యూటీ తహసీల్దార్ జి.శంకర్, శేరిలింగంపల్లి మండల సర్వేయర్ ఎస్.మహేష్, ఆర్ ఐలు శ్రీను, రాంబాబు, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ లేక్స్ శివకుమార్ నాయుడు, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఆనంద్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, నార్త్ ట్యాంక్ డివిజన్, నీటిపారుదల శాఖ నారాయణ, చందానగర్ డీసీ వంశీకృష్ణ, డీఈ నళిని, ఏఈ నాగరాజు, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్, జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నారు.