– సైడ్ కాలువ సీసీ రోడ్ల పనులను త్వరలో అందిస్తాం
– మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఇటీవల మృతి చెందిన మంచాల వెంకన్న మరియు గొట్టిముక్కుల రామ్ రెడ్డి కుటుంబాలను పరామర్శించినట్లు మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపాడు శుక్రవారం వారి కుటుంబాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి న అనంతరం ముత్యాలమ్మ గుడి ఆలయం ప్రక్కన సైడ్ కాలువ సిసి రోడ్డు ఏర్పాట్లకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మృతి చెందిన వ్యక్తులు పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించాలని తపనతో ఎంతో కృషి చేశారని అన్నారు వారు మృతి చెందడం బాధాకరమని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు అనంతరం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ ఆలయ ప్రక్కన ఆకుల రాములు నిమ్మకాయల వెంకటయ్య ఇంటికి వద్ద నుండి ముత్యాలమ్మ గుడి వద్ద వరకు సైడ్ కాలువ ఏర్పాటు చేసి సిసి రోడ్డు వేయాలని మాజీ ఉప సర్పంచ్ యాకన్న పులి వెంకన్న రత్నపురం యాకయ్యతో క్రాంతి రెడ్డి పులి శ్రీను తో పాటు కొంతమంది గ్రామస్తులు కోరడంతో వెంటనే ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించినట్లు తెలిపారు ఈ ఇండ్ల మధ్యలో సైడ్ కాలువలేక మీరు ఎక్కడికి ఆగి దోమలు విపరీతంగా ఉండి వర్షాకాలంలో నడవడానికి ఎంతో ఇబ్బంది ఉంటుందని మరియు ఇక్కడ నీరు నిలిచి ఉండడంతో ఈ బజారులోని కుటుంబ సభ్యులు నడవడానికి ఎంతో ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు విన్నవించగా వెంటనే స్పందించి సీసీ కాలువ ఏర్పాట్లకు త్వరలోనే కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు శ్రీనివాస్ నరసయ్య యాకయ్య తోపాటు కొంతమంది పాల్గొన్నారు