మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శ..

– కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్

నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని రతి రామ్ తండా గ్రామ శివారు ఆవులేగా తండాలో ఇటీవల మరణించిన గుగులోతు కౌసల్య కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బాలాజీ నాయక్  తెలిపాడు మృతి చెందిన వ్యక్తికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు మన ధర్యం నింపే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆమె మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆ గ్రామంలో అందరితో కలిసిమెలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి అని అన్నారు ఆమె ఎంతోమందికి ఎంతగానో అండగా నిలిచి సహాయం చేసిన వ్యక్తి అని అన్నారు అలాంటి వ్యక్తి మృతి చెందడం బాధాకరమని అన్నారు మృతి చెందిన కుటుంబాలకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవేందర్ వెంకన్న రమేష్ శ్రీను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.