మృతురాలి కుటుంబాన్ని పరామర్శ

– మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో జిల్లెల్ల ఉప్పలమ్మ మృతిచెందగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరమాశించినట్లు మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతురాలు ఉప్పలమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మృతి చెందిన కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కొన్ని ఏళ్ల నుండి సేవ చేశారని కొనియాడారు. పార్టీ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఎన్నికల గెలుపు కోసం ఆ కుటుంబం కృషి చేసిందని అన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మృతి చెందడం బాధాకరమైన తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఆమె మృతి చెందడం బాధాకరమని అన్నాడు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్  వర్కింగ్ ప్రెసిడెంట్ మౌనేందర్  ఎక్స్ ఎంపీటీసీ గూగులోతు నరేష్  ప్రవీణ్  పెరుమాండ్ల శంకర్ లింగమూర్తి ,వెంకన్న ,యాకన్న  బండ పల్లి క్రిష్ణ వర్రే అశోక్ జెల్ల సోమయ్య  పిట్టల మురళి దర్శనం ప్రశాంత్, ఆసోద భీమయ్య ,క్రాంతి కుమార్ మల్లికార్జున్ సందీప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.