
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని మునిగిలవీడు గ్రామంలో ఈసంపల్లి సోమమ్మ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి యాదవ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు మృతి చెందిన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి గురువారం ఆ కుటుంబాన్ని సందర్శించి భౌతిక కాయానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని మునిగలవీడు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇసంపెల్లి వెంకటేష్ గారి నానమ్మ అయినా ఇసంపెల్లి సోమమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు వారు పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి గ్రామంలో అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి వారు వంతు కృషి చేశారని అన్నారు అలాంటి గొప్ప వ్యక్తి మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తామని తెలిపారు మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని తెలిపారు. వారితో పాటు మునిగలవీడు సీనియర్ నాయకులు దేశబోయిన ముత్యాలు నిరుడు అనంత రెడ్డి పట్నంశెట్టి నాగరాజు ఇసంపెల్లి యాకయ్య ఇసంపెల్లి మల్లయ్య బొల్లికొండ నాగరాజు ఇసంపెల్లి ఉపేందర్ బండ వెంకన్న గద్దల ఐలయ్య ధర్మారపు శ్రీకాంత్ కొమ్ము నవీన్ ఇసంపెల్లి తరుణ్ ఇసంపెల్లి రమేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.