బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శన..

Visit to Bollepally Primary Health Centre..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలం బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డా. శిల్పిని ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,ఆమ్ ప్రోగ్రాం అధికారి సందర్శించారు. వైద్య ఆరోగ్యశాఖ వైద్య సేవల పటిష్టనికై ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 14 రకాల డయాగ్నొస్టిక్ సేవలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం ఆఫీసర్  ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శిల్పిని, హెచ్ఐవి స్క్రీనింగ్ , కౌన్సిలింగ్ క్యాంపెనింగ్ లో భాగంగా ప్రతి పల్లెదవకరణలో హెచ్ఐవి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఒకవేళ పాజిటివ్ గా తేలితే అలాంటి వారిని జిల్లాలోని వాలంటరీ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ కు రెఫర్ చేస్తారని మరియు అవసరమైన వారికి యాంటీ రిట్రో వైరల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తామని తెలిపారు. ప్రతి పల్లె దవఖానాలో డయాగ్నోస్టిక్ టెస్ట్ లు, హిమోగ్లోబిన్ టెస్ట్, హ్యూమన్ క్రోయిక్ గోనడోట్రోపిన్ , మూత్ర పరీక్ష, బ్లడ్ షుగర్, మలేరియా పరీక్ష, హెచ్ఐవి, డెంగ్యూ, దృశ్య తనిఖీ – ఎసిటిక్ యాసిడ్ ఉప్పులో లోడీ కోసం పరీక్ష, మల కాలుష్య ప్రకటన కోసం నీటి పరీక్ష, క్లోరినేషన్
హెపటైటిస్ బి కోసం హెచ్బిఎస్ ఏజీ  పరీక్ష ఫైలేరియాసిస్ (స్థానిక ప్రాంతాలు మాత్రమే) –  సిఫిలిస్ కోసం రాపిడ్ టెస్ట్ కిట్, ఏ ఎఫ్ టి కోసం కఫం సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పల్లె దవాఖానాలు లసోమవారం గర్భిణీ స్త్రీల పరీక్ష మంగళవారం వయవ్రదుల క్లినిక్ బుధ శనివారాల్లో పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రతి గురువారము బాలింతల సందర్శన,  స్కూల్ హెల్త్ ప్రోగ్రాం ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే తదితర కార్యక్రమాల్లో సేవలు అందుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి  డా యమిని శృతి పాల్గొన్నారు.