నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ శుక్రవారం సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన రైతులకు తెలుపుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వరి పంటలో కాండం తొలుచు పురుగు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు వ్యాప్తి గమనించడం జరిగింది అని కాండం తొలుచు పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 50 ఈసి ఎకరానికి 250 మి.లీ. లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 400 గ్రాములు పిచికారి చేయాలని, బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారణకు స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ మందును ఎకరానికి 50 గ్రాముల చొప్పున పిచికారి చేయాలని ఆయన రైతులకు సూచించడు. వరి పంటలో చీడపీడలు మరియు తెగుళ్ల వ్యాప్తి కనపడినప్పుడు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని పై పాటుగా రసాయనక ఎరువులను వాడరాదని రైతులకు సూచించడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ క్షేత్ర సందర్శనలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.