
నిజాంబాద్ జిల్లా జక్రం పెళ్లి మండలం మనోహరాబాద్ గ్రామంలోని జేఎం కే పి ఎం పసుపు రైతుల ఉత్పత్తి దారుల సంఘాన్ని గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన మున్నంగి గ్రామం కొల్లిపర మండలం పసుపు రైతులు ఈద శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, సతీష్ రెడ్డి, వంగారెడ్డి తదితర రైతులు దుగ్గిరాల పసుపు మార్కెట్ నుంచి వచ్చి ఈ యొక్క పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘాన్ని సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా జేఎంకే పిఎం పసుపు రైతుల ఉత్పద్దాల సంఘం డైరెక్టర్ అల్లూరి సంతోష్ రెడ్డి వారికి పరిశ్రమ యొక్క విశిష్టత గురించి వివరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డైరెక్టర్ పాటుకూరి తిరుపతిరెడ్డి , పడకల్ బోన్ల శ్రీధర్ పాల్గొనడం జరిగినది.