నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్
గుడిహత్నూర్ మండలంలో కలెక్టర్ రాజర్షిషా పర్యటించారు. సోమవారం మండలంలోని మన గ్రోమోర్ ఫర్టీలైజర్ షాప్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని, గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్‌లను, నిల్వ ఉన్న బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, రోజువారి అమ్మకాలపై ఆరాతీశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజాపాలన సేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రజా పాలన సేవా కేంద్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని అధికారులు సమయపాలన పాటించాలని అన్నారు. ప్రజాపాలన బ్యానర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తహసీల్ధార్ కవితారెడ్డి, ఎంపీడీఓ, డీఏఓ పుల్లయ్య, డీసీఓ మోహన్‌సింగ్ పాల్గొన్నారు.