– వీఐటీఈఈ -2024 ప్రవేశ పరీక్ష
– బీటెక్ అభ్యర్థులకు ఏప్రిల్ 30 వరకు ఓపెన్ : వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటరెడ్డి
అమరావతి: వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (వీఐటీఈఈ)-2024 అమరావతిలోని వీఐటీ-ఏపీ క్యాంపస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. ఏటా నిర్వహించబడే కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష, వేలూరు, చెన్నై, అమరావతి (ఆంధ్రప్రదేశ్), భోపాల్‌లోని వీట్ క్యాంపస్‌లలో అందించే బీటెక్ ప్రోగ్రామ్‌లకు అడ్మిషన్లను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ పరీక్షా కేంద్రాల్లో ఏప్రిల్ 30, 2024 వరకు ప్రవేశ పరీక్ష కొనసాగుతుందని వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్వీ కోటరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 125 నగరాలు , విదేశాల్లోని ఆరు నగరాలకు చెందిన అభ్యర్థులు ఆన్‌లైన్ ప్రవేశపరీక్షలో పాల్గొంటారని వివరించారు. ఫలితాలు మే3, 2024న షషష.ఙఱ్.aష. ఱఅలో అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా సెట్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర తెలిపారు. అడ్మిషన్ ప్రాసెస్‌పై మరింత విశదీకరించిన అడ్మిషన్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జాన్ ప్రదీప్, 1.5 లక్షల ర్యాంక్ పరిధిలో అర్హులైన దరఖాస్తుదారులు బి.టెక్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందని వివరించారు. కౌన్సెలింగ్ సెషన్‌ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా మే 3వ తేదీ నుంచి జూన్ 10, 2024 వరకు విడుదల చేశారు.