ముధోల్ నియోజకవర్గం లో గల పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేలకోన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి శనివారం హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ శృతి ఓజా , జేడీ లక్ష్మారెడ్డి, ఆర్జేడి జయప్రదలను కలిసి వినతిపత్రం అందజేశారు.కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అవసరమైన బోధన, బోధనేతర సిబ్బంది, మౌలిక వసతు లు కల్పించాలని విన్నవించారు .అలాగే తానూరు జూనియర్ కళాశాల కోసం నూతన భవనం, మౌలిక వసతులు కల్పించాలని ఆయన కోరారు.కుబీర్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ సబార్డినేట్ వేతనం విషయంపై కూడా అధికారులతో మాట్లాడారు.ప్రభుత్వం కళాశాల లో నేలకోన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు. ఈయన వెంట మాజీ సర్పంచ్ డి. వెంకటేష్, గెస్ట్ లెక్చరర్స్ ,సిడిసి ,సభ్యులు ఉన్నారు.