వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం: వి.వి.కే అద్యక్షులు వేలూరి సుబ్రహ్మణ్యం

Vivekananda's life is an example for the youth: VVK Adyakshulu Veluri Subrahmanyamనవతెలంగాణ – అశ్వారావుపేట
యావత్ భారత్ యువతరానికి వివేకానందుని జీవితం ఆదర్శం అని వివేకానంద వికాస కేంద్రం అద్యక్షులు,కెమీలాయిడ్స్ మేనేజర్ వేలూరి సుబ్రహ్మణ్యం అన్నారు. వివేకానందుని జయంతి ని పురస్కరించుకుని జరుపుకునే జాతీయ యువజనోత్సవాన్ని వివికే ఆద్వర్యం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలిలో గల వివేకానందుని భారీ విగ్రహానికి వేలూరి సుబ్రహ్మణ్యం పూల మాల వేసి నివాళులు అర్పించారు. ముందుగా ధ్వజారోహణం నిర్వహించిన అనంతరం విశ్వ హిందు పరిషత్ బాధ్యులు తనికెళ్ళ సత్య రవికుమార్ మాట్లాడుతూ వివేకానందుడు హిందు ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ప్రవక్త అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కెమీలాయిడ్స్ ఏపీఎం వేణుగోపాల్,దండు శ్రీనివాసరాజు,వీకేడీవీఎస్ రాజు కళాశాల ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,చిన్నం శెట్టి సత్యనారాయణ,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి లు పాల్గొన్నారు.