– గిరిజనులకు ప్రత్యేక వివో ఏర్పాటు చేయాలన్న మహిళలు
నవతెలంగాణ వీర్నపల్లి
వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో మహిళ సంఘాల సమావేశం శుక్రవారం ఎపిఎం నర్సయ్య అధ్వర్యంలో వివో సమావేశం నిర్వహించారు. సి ఎ సుమలత 2018 సం ల నుంచీ ఇప్పటి వరకు ఉన్నా లెక్కలను మహిళ సంఘాల సభ్యులకు వివరించారు సభ్యులు ఆమోదించారు. గిరిజనుల మహిళలు మాట్లాడుతు ఆమె పొట్ట మీద మేము కొడత లేము మాది మాకు వివో కావాలి సార్ మాకు వివో అయితే ఏ లొల్లి ఉండదు సార్ ప్రత్యేక వివో ను ఏర్పాటు చేయాలని ఎపిఎం నర్సయ్య ను కోరారు. ఎపిఎం మాట్లాడుతు గతంలో ఉన్న పెండింగ్ శ్రీనిధి రుణాలు, మహిళ గ్రూపు లు పొదుపు లు వేయడం లేదు, ఎ ఎ సంఘాలు పొదుపు వేయడం అపరో సంఘాలు పొదుపు జమ చేసి క్లియర్ చెయ్యాలి. ఇప్పుడు 25 సంఘాలు ఉన్నాయి, కొత్త గా ఇంకా 5 మహిళ సంఘాలు గ్రూప్ ఏర్పడిన తర్వాత కొత్త వివో ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ముందు తీసుకున్న బకాయి మొత్తం నెల వరకు చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సి రాధ, శ్రీనిధి మేనేజర్ బాబు, వివో అధ్యక్షురాలు సంతోష , అన్ని గ్రామాల సి ఎ లు , మహిళ సంఘాల అధ్యక్షురాలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.