
గ్రామాల్లో పశువులకు వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వీఎల్ఓ ప్రభాకర్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని పోచంపల్లి, అవుతాపురం గ్రామాల్లో టీకాల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో 286 పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు తెలిపారు. 4 నెలలు దాటిన ప్రతీ పశువుకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయిస్తున్నామని చెప్పారు. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం, కాలిగిట్టల మధ్య పగుళ్లు, నోటిలో పుండ్లు పడడం, బాగా నీరసించిపోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం, పని సామర్థ్యం తగ్గిపోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓఎస్ ఉప్పలయ్య, గోపాలమిత్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.