నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ఒకేషనల్ ఇంగ్లీష్ క్యాంపును హైదరాబాద్‌లోని నాంపల్లిలోనే నిర్వహించాలని ఒకేషనల్ అధ్యాపకుల సంఘం నాయకులు పీటర్ మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరితోపాటు ఒకేషనల్ ఇంగ్లీష్ అధ్యాపకులకు ఆర్డర్లను పంపాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఒక జవాబుపత్రానికి రూ23.66 ఉండేదనీ, దాన్ని రూ.30కి పెంచాలని తెలిపారు. రూ.800 ఉన్న డీఏను రూ.వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు. గతేడాది మూల్యాంకనం నుంచి ఎడిట్ కోసమని కోత విధించిన రూ.మూడు వేలను ఖాతాల్లో జమ చేయాలని కోరారు. రెమ్యూనరేషన్‌ను నెలలకోద్దీ ఆలస్యం చేయకుండా క్యాంపు పూర్తయిన వెంటనే నగదు రూపంలో చెల్లించాలని సూచించారు.