బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీజేపీ, హిందు సంఘాలు శనివారం లోకేశ్వరం బందుకు పిలుపునిచ్చారు. నాయకుల పిలుపు మేరకు మండల కేంద్రంలో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ కొనసాగించాయి. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య బద్దంగా పాలన సాగించేల ప్రపంచ దేశాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.