కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలుపించాలి

నవతెలంగాణ – తొగుట
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరిందని మండల పార్టీ మాజీ అధ్యక్షుడు సిలి వేరి మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలం లోని లింగాపూర్, జప్తి లింగారెడ్డి పల్లి గ్రామాలలో స్థాని క బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాయ కత్వంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్ వెంకట్ రామ్ రెడ్డిని భారీ మెజారిటీ తో గెలుపించాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి మెదక్ ఎంపీగా గెలిపిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ గ్రామ కమిటీ అధ్య క్షుడు అశోక్, మాజీ సర్పంచ్ బిక్కనూరి రజిత శ్రీశైలం యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బిక్కనూరి సంతోష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య, పులిందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.