– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
కారు గుర్తుకు ఓటేసి భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అనంతారం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు 100 మంది బీర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎంతో అభివద్ధి చేశారని, ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మండల అధ్యక్షుడు జనగాం పాండు,ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకేష్,సర్పంచ్ చిందం మల్లికార్జున్, గోదా శ్రీనివాస్ గౌడ్, కేశపట్నం రమేష్, అనంతారం గ్రామం బీఆర్ఎస్ యువ నాయకులు వల్లపు విజరు, దండబోయిన బాలరాజు, గ్రామ అధ్యక్షులు బొట్టు మల్లేష్ సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోబొల మీన్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత,తదితరులు పాల్గొన్నారు.