– దివ్యాoగులు, 85 ఏళ్ళ పైబడిన వృద్ధ ఓటర్లకు ఈసి వేసలుబాటు
నవతెలంగాణ: మల్హర్ రావు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసి పకడ్బందీగా చర్యలు చేపట్టనుంది.అందులో భాగంగా దివ్యాoగ ఓటర్లు,85 ఏళ్ళ పై బడిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తోంది.మంథని నియోజకవర్గంలో 1,345పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇందులో 2,42,567 ఓటర్లు ఉన్నారు.దివ్యాoగ ఓటర్లు,85 ఏళ్ళు దాటిన వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేసేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో వారు ఇంటినుంచే ఓటుహక్కు వినియోగించుకునే వెసులుబాటు ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది.పారమ్ 12డి ద్వారా ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకుంటే పోలింగ్ రోజు ఎన్నికల సిబ్బంది ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్ లో ఓటు వేస్తారు.ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరిస్తారు.మంథని నియోజకవర్గంలో 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు 15,567 మంది, దివ్యాoగ ఓటర్లు 4,768 మంది ఉన్నారు.హోమ్ ఓటింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.