యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగులపై వేటు..!

Attack on USAID employees..!– 9,700 మంది తొలగింపునకు ట్రంప్‌ చర్యలు
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు కలకలంరేపుతున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివద్ధి సంస్థ’ (యూఎస్‌ఎయిడ్‌)లో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు చేస్తోంది.ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారట..! మిగతా 9700 మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే, దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్‌ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అటు డోజ్‌ విభాగ సారథి, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా దీనిపై మాట్లాడుతూ.. యూఎస్‌ఎయిడ్‌ నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సంస్థలో వందలాది మంది ఉద్యోగులను సెలవుపై పంపించారు. దాదాపు 120 దేశాలకు మానవతా ద ృక్పథంతో సహాయం చేయడానికీ, ఆ దేశాల అభివ ద్ధికీ, భద్రతకూ నిధులు సమకూర్చడానికి యూఎస్‌ఎయిడ్‌ను నెలకొల్పారు. ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది.