నవతెలంగాణ- మునుగోడు: ఎలాంటి ఆపద ఉన్న మీ కుటుంబానికి అండగా నిలిసే మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని తమ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి మంగళవారం మండలంలోని సింగారం, ఊకోండి, రత్తిపళ్లి, గంగోరి గూడెం, జమాస్తాన్ పెళ్లి, రావి గూడెం, జక్కల వారి గూడెం, కచలాపురం, ఎల్గాలగూడెం గ్రామాలలో ఇంటింట ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవిని తృణపాయంగా వదిలిపెట్టడంతో రాష్ట్రంలోని యంత్రాంగం 119 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి మునుగోడు నియోజవర్గంలోని గ్రామాలకు వచ్చినది వాస్తవం కాదా అని అన్నారు. రాజన్న రాజనామా తోనే మునుగోడు నియోజకవర్గంకు 560 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం నియంతృత పాలన కొనసాగించారని ఆరోపించారు. పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలలో చేయి గుర్తుపై ఓటు వేసి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునుగోడు జెడ్పిటిసి నార బోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్ , మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, నన్నూరు విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు తదితరులు ఉన్నారు .