నవతెలంగాణ-మద్నూర్ : మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలం సిర్పూర్ సొంత గ్రామంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మద్నూర్ ఉమ్మడి మండలం ఎంపీపీ వాగ్మారే లక్ష్మీబాయి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం నాడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈసారి కూడా అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాబోతుందని తెలిపారు నియోజకవర్గం ప్రజలు అభివృద్ధిని చూసి హనుమంత్ షిండే కు గెలిపిస్తారని పేర్కొన్నారు ఎంపీ ఎంపీపీ తో పాటు ఎంపీ బీబీ పార్టీలు కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు