ఓటరు భాష్యం

నగారా మోగిందా
నయాగరా దుమికిందా
సందుల్లో, గొందుల్లో ఏమది?
అదే,
ప్రచార పాటల హోరు!
నేతల జీవన ఘోష!

ఎంత ప్రచారం చేసినా
నేతలకి తీరిక దక్కదు.
ఓటరు ఆంతర్యం చిక్కదు!

మెర్క్యూరీ నవ్వుల నేతలు!
పాదరసం నడకల కార్యకర్తలు!

ప్రచార పథంలో,
కొందరికి రెండు కాళ్లు
మరికొందరికి మూడు కాళ్లు
ఉన్నవాళ్లకి నాలుగుక్కాళ్లు!

అన్ని పక్కలా
సారించాలి మన చూపులు !
పొంచి ఉన్నాయి
ఓటుకు గాలం వేసే వలలు!

ఇది ఎన్నికల
వెరైటీ మేనిఫెస్టోల
ప్రచారాస్త్రం!

ప్రజాస్వామ్య పీఠం పై
ఓటరే మహారాజు!
ఓటు తిరుగులేని బ్రహ్మాస్త్రం!!
(అలిశెట్టి ప్రభాకర్‌ నగర గీతం కవిత ప్రేరణతో…)
– కమలేకర్‌ శ్యాంప్రసాద్‌ రావు,
9441076632