డబ్బులు ఇస్తలేరని రాత్రిపూట ఓటర్ల లొల్లి

నవతెలంగాణ-భిక్కనూర్ : డబ్బులు ఇస్తలేరని రాత్రిపూట ప్రధాన పార్టీ నాయకుల ఇంటి ముందు ఓటర్లు గొడవకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి భిక్కనూరు పట్టణంతో పాటు సిద్ధ రామేశ్వర నగర్, జంగంపల్లి, పెద్ద మల్లారెడ్డి ఇతర గ్రామాలలో పార్టీ నాయకులు ఓటర్లకు పంచాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని బుధవారం రాత్రి నాయకుల ఇంటి వద్దకు వెళ్లి మా డబ్బులు మాకు ఇవ్వాలని, ప్రచారం సమయంలో రోజు వచ్చి ఓటు వేయాలని అడిగిన నాయకులు డబ్బుల పంపిణీ విషయంలో ఎందుకు పక్షపాతం చూపిస్తున్నారని నిరదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గొడవ స్థలానికి చేరుకొని ఓటర్లను వెళ్లిపోవాలని తెలిపారు. కాగా ప్రధాన పార్టీ నాయకులు వారికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే డబ్బులు పంచి మిగతా వారికి డబ్బులు ఇవ్వకుండా నొక్కేసినట్లు, కొంతమందికి డబ్బులు ఇచ్చి మిగిలిన డబ్బులు తమ వద్ద ఉంచుకొని అందరికీ పంపిణీ చేసినట్లు ప్రచారం చేయడంతో డబ్బులు ఇవ్వకున్నా ఇచ్చినట్లు ఏ విధంగా ప్రచారం చేస్తారని పార్టీ నాయకులను నిలదీశారు. అర్ధరాత్రి వరకు జరిగిన గొడవ అక్కడక్కడ గురువారం తెల్లవారుజామున కూడా జరిగింది.