ఏపీ లో ఓటర్లు 4,02,21,450

– ముసాయిదా జాబితా విడుదల
– మహిళా ఓటర్లు 2,03,85,851 మంది
– పురుష ఓటర్లు 1,98,31,791 మంది
– థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,808 మంది
అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు ముసాయిదా ఒటర్ల జాబితాను శుక్రవారం ఆయన విడుదల చేశారు. దీని ప్రకారం పురుషులు 1,97,66,013 మంది, మహిళలు 2,03,83,471 మంది, థర్డ్‌జెండర్‌ 3,808 మంది ఓటర్లుగా నమోదయ్యారు. సర్వీస్‌ ఓటర్లు పురుషులు 65,778 మంది, మహిళా ఓటర్లు 2,380 మంది ఉన్నారు. ఈ జాబితాపై డిసెంబరు తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.