ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి..

– ఎస్సై జూకురు సైదులు..
నవతెలంగాణ – నూతనకల్
ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై జూకురు సైదులు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిల్పకుంట్ల, తాళ్ల సింగారం గ్రామాలలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భరోసా కల్పిస్తూ పోలీస్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని అలాంటి ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి,20 మంది సి ఐ ఎస్ ఎఫ్ ఫోర్స్ సభ్యులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.