నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఓటర్లు స్పెషల్ క్యాంపనింగ్ డేస్ ని వినియోగించుకోవాలని తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. బుధవారం మండలం కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న ఓటర్ స్పెషల్ క్యాంపెనింగ్ డేస్ కి సంబంధించిన వివరాలనపై బూతు లెవల్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ నెల 20, 21 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే వారి కోసం ఫారం నెంబర్-6, ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొర్లితే దాన్ని సరిదిద్దుకొనుటకు ఫారం నెంబర్-8, ఎవరైనా మరణించిన, శాశ్వతంగా షిఫ్టు అయిన వారి కోసం ఫారం-7ని అప్లై చేయించాలని సూచించారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటరు ఎవరైనా ఉంటే, వారికి వారి ఓటు హక్కు గురుంచి అవగాహన కల్పించి, వారితో ఫారం నెంబర్-6 కి దరఖాస్తు చేయించాలని తెలిపారు. ఏ రోజు దరఖాస్తులను ఆ రోజే ఆన్ లైన్ చేయాలని సూచించారు. ఈ రెండు రోజులపాటు బూత్ లెవల్ అధికారులు ఎవరు సెలవు పెట్టకుండా సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, మండల బూత్ లెవల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, కారో బార్లు తదితరులు పాల్గొన్నారు.