ఓటరులారా ఆలోచించండి… ఆలోచన రేకెత్తిస్తున్న ఫ్లెక్సీ ఏర్పాటు

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఎన్నికల పోరు మొదలైంది వివిధ పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు  కాగా పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు, ఆటోవాలా అబ్దుల్ హుస్సేన్ తన ఆటోకు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుంది. ఐదు సంవత్సరాలు పాలించే నాయకుడు ఓటు కోసం మీకు ఇచ్చే లంచం రూ 500… రోజుకు 27 పైసలు. బిచ్చమెత్తుకునేవాడు కూడా 27 పైసలు తీసుకోడు. మంచి నాయకుడు కావాలా.. డబ్బు కావాలా, ఆలోచించండి. అంటూ తన ఆటో వెనక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరిని ఆలోచింప చేస్తుంది.