ఎండను సైతం లెక్కచేయని ఓటర్లు

నవతెలంగాణ- మోపాల్ 

భానుడు నిప్పులు చెరుగుతున్న సరే ఓటర్లు లెక్క చేయడం లేదు. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మోపాల్ మండలంలో  ఎన్నికలో సోమవారం జరుగుతున్న పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకే 45 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పట్టణ ప్రాంతంలో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. మండుటెండలోనూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడం అందులోనూ ఉక్కపోతతోనే క్యూ లైన్లో నిలబడడం గమనార్హం. తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల్లో టెంట్లు వేసినప్పటికీ ఓటర్ల ఎండకు తాళలేక పోయారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం కల్పించడం తో ఓటర్లు ఉపశమనం పొందారు. నిజామాబాద్ నగరంలో విద్యావంతు లు ఉన్న ప్రాంతాల్లోనే పోలింగ్ ఆశించినమేరకు జరగడం లేదు. పేద ప్రజలుండే ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ కేంద్రాలు ఓటర్ల కిక్కిరిసి పోయా యి. నిజానికి ఓటు చైతన్యం మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోనే వికసించింది. ఓటింగ్ సరళని పరిశీలిస్తే అత్యధిక ఓటింగ్ శాతం గ్రామాలలో జరుగుతుంది. అత్యల్పంగా పట్టణంలో జరుగుతుంది అభివృద్ధి మాత్రం పట్టణాలలో అత్యధికంగా గ్రామాలలో అత్యల్పంగా జరుగుతన్నది ప్రభుత్వాలు కూడా అన్ని ఆలోచించుకొని ఓటు శాతం ఎక్కువగా ఉన్న గల గ్రామాల అభివృద్ధి సాధించి అభివృద్ధికి పాటుపడాలి గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు ఉంటాయి కాబట్టి గ్రామాలలో అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వాలు సహకరించాలని ఓటు హక్కు ద్వారా ఓటు చైతన్యంతో గ్రామాలలో అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు. నిజామాబాద్ జిల్లా ఎంపీ స్థానంలో ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి కి మరియు బిజెపి అభ్యర్థి అరవింద్ కి మధ్యనే పోటీ ఉండేవిధంగా ఉంది మారుమూల గ్రామం అయినటువంటి మంచిప్ప గ్రామంలో సాయంత్రం ఐదు గంటల వరకు 78% ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఈ గ్రామం ముందే పోరాటాలకు నిలయం.