
– రైతులు పొద్దు తిరుగుడు సాగు పై దృష్టి పెట్టాలి
– గౌరవెల్లి పూర్తిచేసి.. ప్రతి ఎకరానికి నిరందిస్తాం
– కొనుగోలు కేంద్రం ప్రారంభంచిన మంత్రి
– తడి చెత్త, పొడి చెత్త బుట్టలు పంపిణీ
– మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఎన్నికలు వస్తున్నాయని రామాలయం పేరుతో బీజేపీ ముందుకు వస్తుందని, మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదని, ప్రజాస్వామ్యతంగా ఓట్లు అడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్ లోని మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల్లో నీళ్లు ఎక్కువగా ఉపయోగపడని పొద్దుతిరుగుడు పంటల సాగుపై రైతులు, అధికారులు సాగు పెంచేలా దృష్టి పెట్టాలని అన్నారు. రైతులకు క్వింటాల్ కు రూ .6760 రూపాయల ధర ఉందన్నారు. ప్రతి ఎకరానికి 8- 10 క్వింటాల్ చొప్పున దిగుబడి వస్తుందని అన్నారు. పొద్దు తిరుగుడు పంటలను రైతంగం ఎక్కువగా వేసే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సాహించాలని సూచించారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఒక ఎకరా కూడా ఖాళీగా ఉండకుండా ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో తడి చెత్త పొడి చెత్త చెత్త బుట్టలను పంపిణీ చేశారు. రేపటి నుండి రూ.500 కే గ్యాస్ పథకం అమలవుతుండడంతొ మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్ కి పూలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వాగ్దానాలు అన్ని నెరవేరుస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య పద్ధతి లో చేసుకోవాలన్నారు.మేము ఇచ్చిన హామీలు 100 రోజులు కూడా పూర్తికాకముందే ప్రేరేపితమైన మాటలు ప్రభుత్వాలు కూలగొడతామనే మాటలు మాట్లాడుతూ.. ప్రజలను ప్రతిపక్షాలు కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారన్నారు. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం , ఆరోగ్యశ్రీ రూ .10 లక్షలకు పెంచమన్నారు. మహిళలకు రూ.500 రూపాయల కే సిలిండర్ అందిస్తుండడం మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా చైతన్య యాత్ర చేస్తున్న బండి సంజయ్మీ బీజేపీ ప్రభుత్వం 500 కే సిలిండర్ ఇవ్వగలుగుతుందా అని ప్రశ్నించారు. రూ 500 ఉన్న సిలిండర్ ధర రూ 1200 కు పెంచడంపై మీరు ఏం జవాబు చెబుతారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు.5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ఏమి మాట్లాడలేదన్నారు. బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఏం కొట్లాడారో ప్రజలకు తెలుపాలన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిని సదర్శించిన మంత్రి: హుస్నాబాద్ పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. డయాలసిస్ సెంటర్ తో పాటు 200 పడకలకు అప్ గ్రేడ్ కావాల్సిన వసతులు తదితర సౌకర్యాల పై వైద్యులను ,అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు సౌకర్యాలు కల్పించడం మా బాధ్యత: పాలక వర్గంలో గౌరవ సభ్యుడుగా ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజలను చైతన్య పరచడం,
హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం బాధ్యత అని తెలిపారు. మీ బాధ్యత పక్కన పెట్టి కొత్తగా వచ్చిన తర్వాత మంత్రిగారు తీర్మానాలు చేయమన్నారు , వసులు చేయమన్నారు అనే పరిస్థితి తేవద్దని, నీటి పన్నులు వసులు చేసుకుంటారా లేదా మీ పాలక వర్గం ఇష్టమని అన్నారు. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులతో, రాష్ట్ర స్థాయి అధికారులతో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసే విధంగా నాకు ఆలోచన ఉందన్నారు. పోతారం నుండి వచ్చే వాగులో హుస్నాబాద్ టౌన్ లో వాటర్ ఆగకుండా ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ తో రివ్యూ చేశామన్నారు. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ కి కూడా ఆర్ అండ్ బీ నుండి డబ్బులు వస్తున్నాయని తెలిపారు. మున్సిపాలిటీ బిల్డింగ్ త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. పందిల్ల నుండి ఎల్లమ్మ చెరువు రోడ్డు కి ఆర్ అండ్ బి నుండి నిధులు పెట్టామని , ఎల్లమ్మ చెరువు , ఇంటర్నల్ రోడ్స్ రోడ్డు వైన్డింగ్ అవసరం ఉన్న దగ్గర ప్రతిపాదనలు చేయలని అధికారులకు ఆదేశించారు.తప్పకుండా ప్రభుత్వం తరఫున హుస్నాబాద్ అభివృద్ధికి సంబంధించి మీరంతా అభినందించే విధంగా అభివృద్ధి చేస్తా.. అది నా బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పి సి సి సభ్యులు లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంక చందు, చిత్తరి పద్మ రవీందర్, మాజీ సర్పంచ్ లు మడప జైపాల్ రెడ్డి, బొంగొని శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత ,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.