ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం 

-బల్వంతపూర్, పద్మశాలి గడ్డ, నరేండ్ల గడ్డ గ్రామాల్లో పోలీస్ కవాతు
నవతెలంగాణ -దుబ్బాక రూరల్ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని దుబ్బాక ఎస్సై వి. గంగరాజు తెలిపారు. గురువారం దుబ్బాక మండల పరిధిలోని బల్వంతపూర్, పద్మశాలి గడ్డ, నరేండ్ల గడ్డ గ్రామాల్లో కేంద్ర బలగాల అధికారులు వారీ సిబ్బందితో కలిసి పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సీపీ ఆదేశాల మేరకు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు ప్రశాంతమైన వాతవరణంలో ఓటు వేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని, మద్యం, డబ్బులకు ఆకర్షితులు కాకుండా స్వచ్ఛందంగా నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాలుపడితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు గానీ,పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 లేదా డయల్ 100 కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై, కేంద్ర బలగాల అధికారులు, దుబ్బాక పోలీస్ సిబ్బంది ఉన్నారు.