ఈవీఎంలతో ఓట్ల ప్రక్రియ శులభతరం.. 

నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంతో ఈవీఎంల పనితీరుపై ఓటర్లందరూ పూర్తిగా అవగాహన కలిగియుంటే ఓట్ల ప్రక్రియ శులభతరమవుతుందని నాయిభ్ తహసిల్దార్ పార్థసారథి తెలిపారు.సోమవారం మండల పరిధిలోని రేగులపల్లి,చీలాపూర్,పోతారం గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద మొబైల్ వ్యాన్ ద్వార ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానము,వీవీ ప్యాడ్ ద్వారా ధ్రువీకరించుకునే అంశాలను ప్రజలకు పార్థసారథి వివరించారు.ఓటర్లలో ఈవీఎం యంత్రం పనితీరు ఉపయోగించే విధానం పై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్య పెంపోందించేల ప్రతి గ్రామంలో మొబైల్ వ్యానులను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్టు పార్థసారథి తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు జెల్లా ఐలయ్య,రాగుల మొండయ్య,జెరిపోతుల రజిత, కానిస్టెబుల్ శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ ఉపాద్యాయులు,గ్రామస్తులు పాల్గొన్నారు.