విటి మార్కెట్స్ వారి యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్ఫామ్ కొత్తవారికి అత్యంత నమ్మకమైన సాధనాలను, సమాచార వనరులను అందిస్తుంది, ఇది ట్రేడింగ్ చేయడం సులభం చేస్తుంది~
నవతెలంగాణ హైదరాబాద్: సౌత్ ఆసియాలో ఫైనాన్షియల్ మార్కెట్ లో ప్రస్తుతం గొప్ప వృద్ధి ఉన్నందున, డైనమిక్స్ మారుతున్నందున, ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కారణంగా, ఇక్కడ ఉండేవారిలో ట్రేడింగ్ ఎంచుకునే ప్రజలు కూడా పెరుగుతున్నారు. ఈ విషయం చాలా మంది బ్రోకర్ల ఆసక్తిని ఆకర్షించింది, కానీ ట్రేడింగ్ చేద్దామనుకునే వారికి స్నేహపూర్వక ట్రేడింగ్ ప్లాట్ఫామ్, మొబైల్ అప్లికేషన్తో పాటు వారి ప్రయాణంలో ట్రేడింగ్ లో స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి ట్రేడింగ్ సాధనాలు మరియు ఆలోచనలను అందించగల నమ్మదగిన బ్రోకరేజ్ సంస్థను కనుగొనడం చాలా ముఖ్యం. గ్లోబల్, మల్టీ అసెట్ బ్రోకరేజీ సంస్థ అయిన విటి మార్కెట్స్ ఇటీవల తన వినియోగదారుని స్నేహపూర్వక ప్లాట్ఫామ్, మొబైల్ అప్లికేషన్ ని సౌత్ ఆసియా మార్కెట్లో ప్రవేశపెట్టింది, ఇది కొత్తవారికి ట్రేడింగ్ సులభం చేసేలా ఉంది మరియు అనుభవం ఉన్నవారికి మరింత సహాయపడుతుంది. ట్రేడర్లందరి అవసరాలను తీర్చడానికి నమ్మకమైన, సులభంగా ఉపయోగించగల ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి, రియల్ టైమ్ మార్కెట్ డేటా, చార్టింగ్ టూల్స్, సమాచారం అందించడం, తద్వారా ట్రేడర్లు తక్షణమే స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడటమే కంపెనీ లక్ష్యం.
విటి మార్కెట్స్ తన వినియోగదారులకు వెయ్యికి పైగా ఆర్థిక సాధనాలను అందుబాటులో ఉంచింది, ఇది కమోడిటీలు, బంగారం, ఈటిఎఫ్ లతో సహా దాదాపు ప్రతి అసెట్ తరగతిని ట్రేడ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. కంపెనీ తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి ట్రేడింగ్ వ్యూతో ఒప్పందం కుదుర్చుకుంది, కీలకమైన ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ట్రేడర్లకు ఉత్తమ సమాచార వనరులు అందుబాటులో ఉండేలా చూస్తుంది. సమగ్ర మార్కెట్ పరిశోధన సమాచారం, అధునాతన ఫైనాన్షియల్ విజువలైజేషన్ టూల్స్, మల్టిపుల్ చార్ట్ రకాలు, లైవ్ మార్కెట్ అప్డేట్లతో సహా ట్రేడర్ల కోసం అనేక నిపుణుల సాధనాలను అందించి వారి వినియోగదారులు మెరుగైన నిర్ణయం తీసుకోవడం కోసం ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా ట్రేడింగ్ ప్రక్రియ మరింత సులభం అవుతుంది. విటి మార్కెట్స్ తన ట్రేడర్లకు ఎంచుకోవడానికి వివిధ రకాల ప్లాట్ఫామ్ లను అందిస్తుంది.
వీటిలో ప్రసిద్ధ మెటాట్రేడర్ 4 మరియు 5 ప్లాట్ఫామ్లు, అలాగే వెబ్ట్రేడర్, వెబ్ట్రేడర్ +, విటి మార్కెట్స్ యాప్ ఉన్నాయి. సౌత్ ఆసియా మార్కెట్లోకి వీటీ మార్కెట్స్ ప్రవేశించడంపై కంపెనీ హెడ్ ఆఫ్ అఫిలియేట్స్ లుడోవిక్ మోంక్లా మాట్లాడుతూ “కొత్తగా ప్రారంభించిన వారికి-స్నేహపూర్వకంగా ఉంటూ, అనుభవం ఉన్న వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటూ, ఉపయోగపడే సమాచారం అందించే దృష్టితో, విటి మార్కెట్స్ సౌత్ ఆసియాలోని ఔత్సాహిక ట్రేడర్లకు అత్యంత విలువైన సేవలను అందించబోతుంది” ఇటీవల, విటి మార్కెట్స్ మసెరాటి ఎంఎస్ జి రేసింగ్ తో బహుళ సంవత్సరాల భాగస్వామ్యాన్ని ప్రకటించింది, ఇది ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ ఐఎ ఫార్ములా ఇ ప్రపంచ ఛాంపియన్ షిప్ యొక్క సీజన్ 10తో ప్రారంభమవుతుంది.
మల్టీ అసెట్ బ్రోకరేజీ రంగంలో ఈ తరహా ప్రారంభ సహకారాల్లో ఇది ఒకటి, క్రీడా భాగస్వామ్యంలోకి విటి మార్కెట్స్ యొక్క మొదటి వెంచర్. అత్యుత్తమ సేవలను అందించడంపై నిరంతరం దృష్టి సారించిన విటి మార్కెట్స్ ఇటీవల ఇండిపెండెంట్ ఎక్స్ టర్నల్ డిస్ప్యూట్ రిసోల్యుషన్ (ఈడిఆర్) ఫోరమ్ అయిన ఫైనాన్షియల్ కమిషన్ యొక్క ఆమోదించిన బ్రోకర్ సభ్యత్వం పొందింది. తద్వారా కమిషన్ యొక్క పరిహార నిధి ద్వారా రక్షణతో సహా మెరుగైన సేవ అందించడంలో నిబద్ధతను చూపుతుంది.