కారును ఢీకొట్టి వ్వక్తి మృతి

Elderlyనవతెలంగాణ -పెద్దవూర: కారును ఢీ కొట్టి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జానపాటి లక్ష్మయ్య( 42 )వ్యవసాయం, హోటల్ నడువు కుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో పెద్దవూర నుండి హాలియా వైపు బైకుపై వెళ్తుండగా లింగంపల్లి గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కారును చూసుకోకుండా పూర్తిగా రాంగ్ రూట్లోకి వెళ్లిపోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడం జరిగింది. మోటార్ సైకిల్ పై వెళ్తున్న లక్ష్మయ్యకు గాయాలైనవి. లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇట్టి విషయంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనైనది. మృతుడు లక్ష్మయ్య కి భార్య శైలజ ఇద్దరు అమ్మాయిలు వున్నారు.