నిద్ర వస్తలోనున్న కాంగ్రెస్ పార్టీకి “ఆయువు పోస్తున్న” వాడల పర్వతాలు

నవతెలంగాణ-రేవల్లి 
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరికి వస్తున్న ఈ తరుణంలో, పార్టీ బలాబలాలను పరిశీలించడంలో మరియు పెంపొందించుకోవడంలో, అన్ని పార్టీలు, వారి వారి బలాబలాలకు అనుగుణంగా ఎత్తులకు పై ఎత్తులను వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. అదే విధంగా రేవల్లి మండలంలోని వాడల పర్వతాలు గత ఐదు సంవత్సరాల నుండి నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, నిద్ర నుండి మేల్కొలిపి తనదైన శైలిలో ముందుకు సాగడంలో తన యొక్క పదునైన మాటలతో, అశేషమైనటువంటి తెలివి తేటలతో జనవాహిని లో తనకంటూ ఒక గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతున్నారు. వందమందిని చంపితే వీరుడంటారు, అదే ఇద్దరిని కాపాడితే దేవుడు అంటారు, కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని మండలంలోని కాంగ్రెస్ పార్టీకి వన్నెతెస్తున్నటువంటి వాడల పర్వతాలు గారిని జన నాయకుడని ఇక్కడి ప్రజలు కితాబునిస్తున్నారు. మొన్నటికి మొన్న, రేవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వనపర్తి చిన్నారెడ్డి గారి సలహాలతో ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీలో  తన యొక్క ముద్రను చూయిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తను ప్రజలపై చూపిన ఆదరణకు గాను, ప్రజాదరణ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.