మధ్యాహ్న భోజన కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలి… 

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల వెంటనే పదివేల వరకు వేతనం పెంచాలని శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ధర్నా రెండు రోజులపాటు నిర్వహిస్తామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి కార్మికులకు నెలకు పదివేల రూపాయల వేతనం ఇస్తానని ఎన్నికల మేని ఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు.కానీ గత ప్రభుత్వం పెంచిన 2000 రూపాయలు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలలో వేతనాలు ఇచ్చారు,కొన్ని ప్రాంతాలలో అవి కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నదని తెలిపారు. మూడు వేల రూపాయల వేతనం ఇస్తానన్న ప్రభుత్వం గత ఆరు నెలలుగా పెండింగ్లోనే ఉంచిందన్నారు. 9 ,10 తరగతులకు 9 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని కనీసం పూర్తి వేతనాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడిందన్నారు.పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచి పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు,సిఐటియు శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి చెరుకు ఏకలక్ష్మి పట్టణ కార్యదర్శి సాయికుమార్ తిరుపమ్మ జయమ్మ సుమిత్ర శైలజ వెంకటమ్మ శివ పార్వతి వరలక్ష్మి తాళ్లూరి లక్ష్మి జాన్వి పతాని దుర్గ సంధ్య సిఐటియు పట్టణ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.