మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

– డీసీఎంఎస్‌ చైర్మెన్‌ కొత్వాల
నవతెలంగాణ-పాల్వంచ
పాల్వంచ మున్సిపాలిటీలో చాలీ చాలని జీతాలతో గత 25 సంవత్సరాలుగా ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులుగా పని చేస్తున్న కార్మికుల వేతనాలను పెంచేలా ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలని జిల్లా కోపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మెన్‌, జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్‌ ఏ.స్వామికి కొత్వాలతో పాటు కార్మికులు, కాంగ్రెస్‌ నాయకులు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటురతున్న చాలీ చాలని జీతాలతో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.స్వామి, ఏఈ రాజేష్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ లక్ష్మణ్‌ రావు, పాల్వంచ మాజీ జడ్పీటీసీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు నరేష్‌, ఎస్‌.కె.అక్బర్‌, ఎస్‌.కె.జాని, పవన్‌, రామజోగి, కాంగ్రెస్‌ నాయకులు కందుకూరి రాము, కాపర్తి వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు.