ప్రత్యేక వరాల కోసం ఎదురుచూపులు

For special gifts Anticipation– సొంత గడ్డపై రేవంత్‌ రెడ్డి బహిరంగ సభ
– మాజీ కేంద్రమంత్రి జయపాల్‌ రెడ్డి విగ్రహావిష్కరణ
– సొంతజిల్లాకు మొదటిసారి రాక
– హర్షం వ్యక్తం చేస్తున్నా జిల్లా వాసులు
– సీఎం రాకపట్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూడాలి : బాదావత్‌ సంతోష్‌ కలెక్టర్‌ నాగర్‌ ర్నూల్‌ జిల్లా
సొంత జిల్లా నాగర్‌ కర్నూల్‌ కు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి మొదటిసారి వస్తున్న సందర్భంగా జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా వరాల జల్లు కురిపిస్తున్న రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాకు ఎలాంటి హామీలు ఇస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు లక్షల రుణమాఫీ లో ఇప్పటికే లక్ష వరకు పూర్తి చేసినప్పటికీ అర్హులైన అనేకమంది రైతులకు ఖాతాలో డబ్బులు పడలేదు. రైతుబంధు పింఛన్ల వంటివి ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఈ రెండు రోజుల క్రితం రాష్ట్ర బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా ఈ జిల్లాకు ప్రత్యేక పథకాలు ఏవి ప్రకటించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఎటువంటి పథకాలను ప్రకటిస్తారో నని రాజకీయ నాయకులు యువకులు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నవతెలంగాణ-మహబూబ్‌ నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కోట్ర దగ్గర మాజీ కేంద్రమంత్రి ఎస్‌ జైపాల్‌ రెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు.ఈ సందర్భంగా జన సమీకరణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం మినహాయించి మిగతా 6 గ్యారంటీలలో 12 అమలు కావడం లేదు. ఉచిత గ్యాస్‌ విద్యుత్తు పింఛన్లు వ్యవసాయతరులకు సంవత్సరానికి 12000 ఒంటివి ఎక్కడ అమలు జరగడం లేదు. ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. అంతా సహాయం కింద రైతు భరోసా అందడం లేదు. రెండు లక్షల రుణమాఫీ సైతం పాక్షికం గానే చేరింది.ముఖ్యంగా లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేశామని చెబుతూనే అనేక కొర్రీలు పెడుతున్నారు. అండర్‌ వెరిఫికేషన్‌ పేరుతో వేలాది మంది రైతులకు లక్ష రూపాయల రుణం చేరలేదు. ఇక సర్వీస్‌ లో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ నిలిపేశారు. రుణమాఫీ లో నిబంధనలు లేనివి అమలు చేస్తున్నారు. ఆధార్లో ఒక పేరు బ్యాంకు ఖాతాలో మరో పేరు ఉందనేపం చూపి నిలిపేశారు.జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనే 133 ఫిర్యాదులోచ్చాయి. వీరంతా రుణమాఫీ అర్హత ఉండి డబ్బులు నిలిపివేయబడ్డవారు. ఏవోలు డిఏఓలు ఏడీఎ దగ్గర. ఇంకా అనేక ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ సమస్యలపై ఒక వివరణ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకం గా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతానికి నిధులతో పాటు పనులు జరగాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే జరిగిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాకతో పాలమూరు రంగారెడ్డి తిరుపతిలో పథకం పనులపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆయకట్టు రైతులు జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అను కూలమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా కాగితం కాటన్‌ ఆయిల్‌ బీడీ చేనేత వంటి పరిశ్రమలకు ముడి సరుకులతో పాటు భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి పరిశ్రమలపై దష్టి సారిస్తారని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సొంత గడ్డపై ఆనందోత్సవాలు
జర్నలిస్టుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో దిట్టగా ఉండి జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే ఎంపీగా పీసీసీ అధ్యక్షునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లె గ్రామ నివాసి.ఎనుముల రేవంత్‌ రెడ్డి జిల్లాకు రాక పట్ల ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ప్రతిసారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి కేవలం దసరా పండుగ సందర్భంగా వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్య మంత్రి హౌదాలో సొంత గడ్డపైకి రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు మహిళలు యువజనులు సైతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోసం కల్వకుర్తి రావడానికి సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా సొంత గ్రామం కొండారెడ్డిపల్లి నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంటి నుండి తరలి వచ్చే అవకాశం ఉంది.