నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూప్రభుత్వం రెండు లక్షలు రూపాయల రుణమాఫీ చేసి బెసరత్తుగా రైతు ఖాతాలో డబ్బులు జమ చేయాలి ప్రభుత్వం సాంకేతిక కారణాలని చెబుతూ కాలం వెళ్లదీస్తుంది. అట్లాంటి నిబంధనలు ఏమైనా ఉంటే సంబంధిత శాఖ మంత్రివర్యులు ప్రకటన ఇవ్వాలి నాలుగు రోజులలో ప్రకటనలేక రుణమాఫీ జరగకపోతే రైతుల పక్షాన ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేయడం జరుగుతుందని గాంధారి మండలం బీజేపీ అధ్యక్షులు మధుసూదన్ రావు హెచ్చరించారు. ఎలాంటి షరతు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చెల్లించాలని లేని పక్షంలో రైతుల పక్షన్న పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని రైతులకు సకాలంలో రుణమాఫీ జరగకపోతే ఉద్యమకార్య చరణప్రకటిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కిషన్ మోర్చా అధ్యక్షుడు సంజీవ్,గిరిజన మోర్చా పార్లమెంట్ కన్వీనర్ కాట్రోత్ రవి , మాజీ అధ్యక్షులు సాయిబాబా , గాంధారి సోసైటీ డైరెక్టర్ రాథోడ్ నెహ్రూ , ఎస్టి మండల అధ్యక్షులు యన్ నవీన్ , మండల ఉప అధ్యక్షులు హుసేన్ , టౌన్ అధ్యక్షులు గంగి రమేష్, సీనియర్ నాయకులు సాయగౌడ్, కతూరి శ్రీనివాస్, కే రాజేందర్, దొడ్ల భాస్కర్ రావు, సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.