రైతులకు మాఫీ డబ్బులు వారి ఖాతాలో జమ చేయాలి

Waiver money should be credited to farmers' account– లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డిఎం) హరి బాబు
నవతెలంగాణ – తొగుట
రుణ మాఫీ పొందిన రైతులకు త్వరిత గతిన రుణ మాఫీ డబ్బులు వారి ఖాతాలలో జమ చేయాలని ఎపిజివిబి బ్యాంకు మేనేజర్ ను లీడ్ బ్యాంకు మేనేజర్ (ఎల్డిఎం) హరి బాబు ఆదేశించారు. గురు వారం జిల్లా వ్యవసాయ అధికారి మహేష్ తో కలి సి తొగుట గ్రామీణ వికాస్ బ్యాంకు ను సందర్శిం చారు.అనంతరం వారు మాట్లాడుతూ రుణ మాఫీ పొందిన రైతులకు త్వరిత గతిన రుణ మాఫీ డబ్బులు వారి ఖాతాలలో జమ చేయాలని బ్యాం కు మేనేజర్ కు సూచించారు. రుణ మాఫీ పొందిన రైతులు వారికి తగిన డాకుమెంట్స్ (పత్రాలు ఆధా ర్ కార్డ్, పట్టా పాస్ బుక్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, భూమి సంబంధించిన 1 బి జిరాక్స్ లు) బ్యాంకు అధికారులకు అందజేయాలని తెలిపారు. అనంత రం రుణమాఫీ డబ్బులు పొందాలని అన్నారు. ఈ సందర్శనలో వ్యవసాయ అధికారి మోహన్, బ్యాం కు మేనేజర్ జలంధర్ తదితరులు పాల్గొన్నారు.