రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి:వాజిద్ హుస్సేన్

నవతెలంగాణ- నవీపేట్: రభి సీజన్ సందర్భంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం మాట్లాడుతూ రైతులకు నీటి ఆవశ్యకత తెలుసుకోవాలని ప్రస్తుత పంటల స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు అలాగే ఎరువుల లభ్యత గురించి మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అభంగపట్నం శివారులోని డి-50 కాలువతో పాటు పరిసరాల్లోని పంటలను పరిశీలించారు. ఆయన వెంట సంతోష్ కుమార్, ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.