రాక్షసులు ఏలుతున్నారు రాజ్యాన్ని
ఇకనైనా మేలుకో
రాయి రాయి రాపిడి జరిగి
నిప్పు పుట్టినట్టు
నరుడు నరుడు కలిసి
నరరూప రాక్షసులను
నరకలేరా!
లే! ఇకనైనా మేలుకో
నీ రాణిని చెయ్యి పట్టి లాగాడు ఒకడు
నీ తోబుట్టువును
చెరబట్టాడు ఇంకోడు
నీ తల్లిని దుర్భుద్ధితో
దుర్భాషలాడాడు మరొకడు
వాడి చెయ్యి
వాడి మర్మాంగం
వాడి నాలుక
అప్పుడే తెగ్గొయ్యాలి
లే! ఇకనైనా మేలుకో
నీ బతుకును
బానిస బతుకుగా
చేసిన వాడి తల
మొండెం నుంచి వేరు చెరు
లే! ఇకనైనా మేలుకో
ఎప్పుడు వస్తావ్? ఎన్నడు చేస్తావ్
నీలోని జ్వాలని రగిలించేరు
జ్వాలని కార్చిచ్చుగా మార్చేరు..
అంటించు ప్రతీ చెదలు పట్టిన వక్షాన్ని
కాపాడుకో ఇంకో వక్షాన్ని చెదలు పట్టకుండా
నీలోని అగ్నిని అణువణువునా ప్రజ్వలించు
నీకై నీవారి కోసమై
మరణించు మార్పు కోసమై
జనియించు మరల మత్యువువై
జీవించు ప్రళయ కాల కాలుడివై
లే! ఇకనైనా మేలుకో!
– అసుర