
నవతెలంగాణ – బంజారా హిల్స్
యువత మేలుకో దేశాన్ని కాపాడుకో ఈ ఓటు అనే హక్కు ఆయుధాన్ని కల్పించిన మహానీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అయితే కనీస వయస్సు నిర్ధారించిన మహానీయుడు మాజీ ప్రధానమంత్రి దేశంలో సాంకేతిక విప్లవన్ని నవ శకానికి బాటలు వేసిన గొప్ప దర్శనీకుడు రాజీవ్ గాందేనాని ఆయన స్ఫూర్తితో దేశన్ని కాపాడుకోవడానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. 79వ జయంతి సందర్భంగా సోమాజిగూడలోని రాజీవ్ విగ్రహం వద్ద పార్టీ జాతీయ ఏఐసీసీ ఇంఛార్జి మనిక్ రవ్ థాక్రేతో కలిసి ఆయన నివాళులు అర్పించారు. మోదీ తన మిత్రులకూ,కేసీఆర్ తన కుటుంబానికి ప్రజల సొమ్మును దోచి పెడుతున్నరని ద్వాజేమెత్తరు. దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు. “రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారు రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలను బలోపేతం చేశారు.దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారు” అని రేవంత్ రెడ్డి అన్నారు. సాంకేతిక విప్లవం తీసుకు వచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. “ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు చేర్చారు. దేశంలో యువకులకు రాజీవ్ ఒక స్పూర్తినిచ్చారు. దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం” అని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో బీజేపీ విభజించు పాలించు విధానాన్ని అవలంభిస్తోందని విమర్శించారు.బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని ఎద్దేవా చేశారు.మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. బీజేపీ, బీఆరెస్ నాణానికి బొమ్మా, బొరుసులాంటివని, వారిద్దరిది ఫెవికాల్ బంధమని మరోసారి స్పష్టం చేశారు. దేశ సంపదను మోదీ తన మిత్రులకు దోచి పెడుతుంటే… కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్,వి హనమంతరావు,ఏఐసీసీ పరిశీలకురాలు దీపదాస్ మున్షీ,ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, జగ్గారెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు టి పి సీసీ ప్రధాన కార్యదర్శి పి విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.