తపాలా ఏజెంట్ల వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతీయ తపాలశాఖ జీవిత, గ్రామీణ బీమా పాలసీలు సేకరించేందుకు ఏజెంట్ల నియామకాన్ని ఆహ్వానిస్తుంది. ఈ మేరకు ఆ శాఖ హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఏ సుభ్రహ్మణ్యం మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పాసై, 18-50 ఏండ్ల మధ్య వయసు ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులు, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులు దీనికి అర్హులు. దరఖాస్తుల్ని ఈనెల 26లోపు ఆబిడ్స్‌లోని హైదరాబాద్‌ నగర తపాలాశాఖ కార్యాలయంలో అందచేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థులు జూన్‌ 27,28 తేదీల్లో ఉదయం పది గంటలకు టెన్త్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు తీసుకొని ఇంట ర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఏజెంట్‌గా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.5వేలు చెల్లించాలి. ఇతర వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించవచ్చు. ఏజెంట్లు సేకరించిన పాలసీలపై కమిషన్‌ను అందచేస్తారు. ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్‌ నగర తపాలశాఖ ఫోన్‌నెంబర్లు 040-23463526/527 ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నెంబర్లతో పాటు డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ టీ వెంకటరమణ 9949335598, బీ సత్యనారాయణ 9949012374 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.