– చిరుధాన్యాలు ప్రయోజనం పై ఆదివాసీలకు అవగాహణ….
నవతెలంగాణ – అశ్వారావుపేట : పోషణ్ పక్వోడా కార్యక్రమంలో భాగంగా సమీకృత మాతా శిశు అభివృద్ది ప్రాజెక్ట్ అశ్వారావుపేట మండల పరిధిలో గల దట్టమైన అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న వలస గిరిజన ఆవాసాలు అయిన రేగళ్ళ,జిల్లేడు పాక,రెడ్డి గుంపు కాలనీ,చెన్నాపురం,చెన్నాపురం మినీ అంగన్వాడి కేంద్రాల లో మంగళవారం సీడీపీఓ రోజా రాణి,సిబ్బంది పర్యటించి ఆదివాసీల కు పక్వడా నిర్వహించారు. ఇందులో భాగంగా చిరుధాన్యాలు వాడకం,వీటి ప్రయోజనం తో మెరుగు పడే ఆరోగ్య విధానం వివరించారు. పుట్టగానే పిల్లలకు ముర్రుపాలు తాగించడం ద్వారా పిల్లల ఆరోగ్యం,తల్లి తీసుకోవాల్సి మెరుగైన పోషక విలువలు వున్న ఆహారపదార్ధాలు ను తెలియజేసారు. ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత (ఈసీసీఈ),ఇనేఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్(ఐవైసీఎఫ్) గురించి వివరించారు. ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం మార్చి లో 15 రోజులు పాటు నిర్వహించే ఈ కార్యక్రమం ఈ ఏడాది గొంతెత్తి కోయిల నివాసాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్ వైజర్ పద్మావతి,వరలక్ష్మీ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.