– కండువా కప్పిన జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ ఆధ్వర్యంలో పలువురు నేతలు హస్తం గూటికి చేరారు. వరంగల్ మేయర్ గుండుసుధారాణి,మానవతారారు జగ్గారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చినా తీసుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. సంగారెడ్డిలో తనకు వ్యతిరేకంగా పని చేసిన వారు కూడా ఇప్పుడు పార్టీలోకి వస్తానంటే కండువా కాప్పాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌లో చేరుతామంటూ ఒత్తిడి పెరుగుతోందన్నారు. కొంత మంది అధిష్టానానికి ఉత్తరాలు రాస్తున్నారని తెలిపారు. త్వరలో రాహుల ్‌గాంధీ, ప్రియాంకగాంధీ సభలు ఉంటాయని చెప్పారు.